స్వామి పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరణ.

(under section 3 of Telangana prevention of anti-social and Hazardous activites
act1980) ప్రకారం స్వామీజీపై నగర బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించారు.

1.
1 నవంబర్ 2017లో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ
సభలో స్వామీజీ ప్రసంగిస్తూ ముస్లింలకు , క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు పెద్దమొత్తం
ప్రభుత్వాలు పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని సబ్సిడీలుగా ఇస్తున్నాయని ప్రశ్నించారని…అలాగే
హిందువులు తమ పవిత్ర క్షేత్రాలకు వెళ్లాలంటే మాత్రం సర్ ఛార్జీల పేరుతో పన్నులు వసూలు
చేస్తున్నారని వ్యాఖ్యానించారని పోలీసులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని
పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు.

2.
అలాగే 2 డిసెంబర్ 2017లో రామేశ్వరపల్లి గ్రామం, కామారెడ్డి జిల్లాలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు
చేశారని ఆరోపణలు గుప్పించారు.

– ఈ సమావేశంలో మీకు నిజాం పాలన కావాలా? లేక ఛత్రపతి శివాజీ పాలన కావాలా అంటూ
స్వామీజీ యువతను ప్రశ్నించడంపై పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు

– మొగల్ పాలకులు బాబర్ , గజనీ మహమ్మద్ , ఖిల్జీ, హుమాయున్ వంటి వారు దేశంలో
హిందువులపై ఎన్నో అరాచకాలు చేశారని…, అత్యాచారాలు, లూటీలు చేశారని ఎంతోమంది
హిందువులను ముస్లిం పాలకులు చంపివేశారని స్వామీజీ తన ప్రసంగంలో పేర్కొన్నారని…ఇవి
అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు

– అలాగే ఈ తెలంగాణ భూమిలోనూ రజాకర్లు ఎన్నో ఘోరాలు చేశారని…ప్రజలపై ముఖ్యంగా
హిందూ మహిళలపై దమనకాండను కొనసాగించారని అన్నారన్నారని…ఇవి కూడా తమకు
అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు

-ఎంతో కాదు స్వామీజీ తెలంగాణలోని ప్రాంతాలు పట్టణాల పేర్లను సైతం మార్చాల్సిన అవసరం
ఉందని స్వామీజీ అన్నారని పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
నిజామాబాద్ , హైదరాబాద్ , సికింద్రాబాద్, ఆదిలాబాద్ , మహబూబ్ నగర్ , అలాగే నిజామాబాద్
పేరును దాని పూర్వనామం ఇందూరుగా పేరు మార్చాలని అన్నారని పోలీసులు చెప్పుకొచ్చారు.

3.
అటు11 మార్చి 2018లో కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో నూ అభ్యంతరకర
వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

స్వామీజీ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ U/S OF 3, Telangana
prevention of anti-social and Hazardous activites act1980 చట్టం ప్రకారం తాము జూబ్లీ
హిల్స్ పోలీసులు స్వామీజీకి 09-07-2018 రోజున స్వామీజీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు
పోలీసులు పేర్కొన్నారు. అయితే స్వామీజీకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వారి లీగల్ అడ్వైజర్
తెలిపారు.

నోటీసలు ఇచ్చిన 24 గంటల తర్వాత కూడా స్వామీజీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అందుకే
వారిని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరంలో ప్రవేశించకుండా బంజారాహిల్స్ ఏసీపీ నిషేదాజ్ఞలు
విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏసీపీ ఆజ్ఞాల మేరకు ఈ రోజున తెల్లవారు జామున స్వామీజీ నివాసంలోకి చొరబడిన పోలీసులు
వారికి EXTERNMENT ORDER చేతిలో పెట్టి అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి
తరలించారు.

ఆరు నెలల తర్వాత స్వామీజీ హైదరాబాద్ లో ప్రవేశించాలంటే కూడా ఆంక్షలు విధించిన పోలీసులు

-అంతేకాదు ఇకపై స్వామీజీ హైదరాబాద్ నగరంలో ప్రవేశించాలంటే ముందుగా ఇన్పెక్టర్ ఆఫ్
పోలీసు అనుమతి తీసుకోవాలని…, అలాగే తాను నివసించే చిరునామా తెలుపాలని , అలాగే తాను
ఎంతకాలం అక్కడ నివాసం ఉంటున్నారో కూడా తెలుపాలని ఆంక్షలు విధించినట్లు చెప్పారు.

– పోలీసులు విధించిన ఈ ఆంక్షలపై 15 రోజుల్లో స్వామీజీ ట్రిబ్యూనల్ కు వెళ్లవచ్చనని కూడా
చెప్పారు.

ఈ రోజు 11/07/2018 తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో స్వామీజీ నివాసంలోకి
ప్రవేశించిన పోలీసులు వారిపై నగర పోలీసు కమిషనర్ స్వామీజీపై నగర బహిష్కరణ ఉత్తర్వూలు
జారీ చేసినట్లు తెలిపారు.

– 09వ తేదీన నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇది పచ్చి అబద్దమని స్వామీజీ లీగల్ అడ్వైజర్
తెలిపారు.

– తమ ఆరాధ్యదైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని…ఇది తమకు ఎంతగానో
మనోవేదన కలిగించిందని…, శ్రీరామనామ జపం చేస్తూ తాము బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు
పాదయాత్ర చేసి…తమ ఆవేదనను…బాధను ఆ లక్ష్మీనరసింహ స్వామీకి చెప్పుకుందామని
సంక్పలించారు.

– మొదట స్వామీజీ యాత్రకు అనుమతించిన పోలీసులు ఆ తర్వాత శాంతిభద్రతల సాకుతో
పాదయాత్ర పర్మిషన్ ను రద్దు చేసినట్లు ప్రకటించడమే కాకుండా…., ఎలాంటి నోటీసులు,
కారణంగా ఇవ్వకుండానే స్వామీజీని వారి నివాసంలోనే గృహనిర్బంధంలో ఉంచారు. రెండు
రోజుల తర్వాత వారిని అదుపులోకి తీసుకుని నగర బహిష్కరణ ఆంక్షలు విధించినట్లు చెప్పారు.

న్యాయం-ధర్మం నాకు రెండు కళ్లు: స్వామి పరిపూర్ణానంద

న్యాయం అడిగితే తనను బహిష్కరణ వేటు వేశారని…, దీనిపై ఎవరు ఆవేశాలకు లోనుకావ్వొద్దని
పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఉండాలని, రామనామ జపాన్ని కొనసాగించాలని కోరారు.
ఎప్పటికైనా గెలిచేది న్యాయం-ధర్మమేనని అన్నారు.

– హిందూ ధర్మంపై, హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటున్నవారికి రాబోయే రోజుల్లో
ప్రజలే బుద్ది చెబుతారన్నారు.

– హిందూ ధర్మంపై దాడులు చేసే జాతివ్యతిరేక శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని స్వామీజీ
చెప్పారు