హుజూర్నగర్ లో టిఆర్ఎస్ గ్రూపు తగాదాలు. ఆత్మాహుతికి ప్రయత్నించిన శంకరమ్మ వర్గీయుడు. తీవ్ర ఉద్రిక్తత.

 

సూర్యాపేట;
హుజూర్ నగర్ లో అధికార టిఆర్ఎస్ కు చెందిన పార్టీ ఇంచార్జ్ శంకరమ్మ, అంకిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్.ఆర్.ఐ. శానంపూడి సైదిరెడ్డి వర్గియుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు భారీగా మోహరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ గ్రూపు తగాదాలు రోడ్డుకెక్కాయి. మఠంపల్లి మండలం లో అంకిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో యువతకు దిశా నిర్దేశం పేరిట ‘సై’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సైదిరెడ్డి కి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చాలా కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మఠంపల్లి మండల కేంద్రం లో ప్రధాన రహదారిపై శంకరమ్మ వర్గీయులు ధర్నా నిర్వహించారు. శంకరమ్మ వర్గానికి చెందిన కార్యకర్త నాగు నాయక్ ఒంటి పై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంటానని కొద్దిసేపు హల్ చల్ చేశాడు.