హైకోర్టును ఆశ్రయించిన స్వామి పరిపూర్ణానంద

హైదరాబాద్:
నగర బహిష్కరణపై పరిపూర్ణానంద స్వామి హైకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. సోమవారం విచారణ చేపట్టనుంది. ప్రతివాదిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ ఉంటారు. ఇటీవల సినీ విమర్శకుడు కత్తి మహేష్.. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పరిపూర్ణనంద స్వామి ధ్వజమెత్తారు. అనంతరం కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజుల వ్యవధిలో పరిపూర్ణనంద స్వామిని కూడా నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి