హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి సదస్సు.

హైదరాబాద్:
హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపోందుతుందన్నారు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్. సచివాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ గ్లోబుల్ వాటర్ సెక్యూరీటి కాన్ఫరెన్సు వివరాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా నీటి వినియోగం పై ప్రస్తుతం చర్చ జరుగుతుందన్నారు. నీటి అవసరాలు వ్యవసాయం సాగు తో పాటు పారిశ్రామిక, సామాన్య జీవితంలో ఎంతో అవసరం అనే అంతర్జాతీయ స్థాయి సదస్సు కు హైదరబాద్ నగరం వేదిక కావడం సంతోషకరం అన్నారు మంత్రి చందూలాల్. అక్టోబర్ 3వ తేది నుండి 6 వ తేది వరకు తాజ్ కృష్ణ హోటల్ లో ఈ సధస్సు జరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తూన్న అధునిక పద్దతుల ద్వారా తక్కువ నీటి తో ఎక్కువ పంటలు పండించేందుకు అవసరమైన సాంకేతిక తో పాటు రైతులకు , పారిశ్రామిక అవసరాల కు నూతన పద్దతుల ద్వారా వాటర్ మెనేజ్ మెంట్ ద్వారా నీటి వాడకం పై అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్సు జరుగుతుందన్నారు మంత్రి చందూలాల్.

అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సు కు సుమారు 20 దేశాల నుండి ఐదు విభాగాల లో 500 మంది ప్రపంచ ప్రసిద్ధ వ్యవసాయ ఇంజనీర్లు , జీవ శాస్త్ర విభాగానికి చెందిన ఇంజనీర్లు తో పాటు మరో రెండు వందల మంది స్పీకర్లు ఈ సదస్సు లో ప్రసంగించనున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ప్రతిపాదనల ద్వారా గ్లోబుల్ వాటర్ సెక్యూరీటి కాన్ఫరెన్సు హైదరాబాద్ నగరానికి వేదిక గా సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశం లో ఇండియా మరియు అమెరికా లోని ప్రసిద్ద యూనివర్సీటీ మిచిగాన్ యూనివర్సిటీ, యూనివర్శిటి ఆఫ్ అర్కనాస్ కు చెందిన బయోలాజికల్ ఇంజనీర్లు, తో పాటు అమెరికా సోసైటీ అఫ్ ఆగ్రోనమీ తో పాటు టేక్సాస్ ఎ ఆండ్ ఎం యూనివర్శిటి కి చెందిన వ్యవసాయ మరియు బయోలాజికల్ శాస్త్రవేత్తల తో పాటు ఇండియన్ సోసైటీ ఆఫ్ అగ్రికల్చర్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గోంటారని పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి సదస్సు కు హైదరాబాద్ నగరం వేదిక అయినందుకు మిచిగాన్ యూనివర్శిటి చెందిన ప్రసిద్ద శాస్త్రవేత్త డా. ఇంద్రజీత్ చౌబె అనందం వ్యక్తం చేసారు.