‬ఏపీలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు. -విజయసాయిరెడ్డి.

విశాఖపట్నం:
ఏపీలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చు.. సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. విజయనగరం, అరకు వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ లెవల్ కమిటీ సమావేశాలను నిర్వహించారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. బూత్ లెవల్ కమిటీల్లో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. విజయనగరం జిల్లాలో ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ స్థానాలు గెలవాలని అన్నారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, సూక్ష్మ స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండాలని, బూత్ లెవల్ కన్వీనర్లు సైనికుల్లా పని చేయాలని, పార్టీ జెండాకు ద్రోహం చేయని వారికి స్థానం కల్పించాలని అన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ నిర్వహించిన మినీ మహానాడు కన్నా వైసీపీ ప్లీనరీ సమావేశాలే విజయవంతమయ్యాయని అభిప్రాయపడ్డారు.