- వాటిలో ఒకటి హైదరాబాద్ ఫ్లైట్.
హైదరాబాద్;
బెంగుళూరు ఆకాశమార్గంలో రెండు ఇండిగో విమానాలు వెంట్రుకవాసిలో ఒకదానిని ఒకటి ఢీకొనే ప్రమాదాన్ని తప్పించుకొన్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పైలెట్లు త్రుటిలో పెనుప్రమాదాన్ని తప్పించారు. ఈ ఘటన మంగళవారం (10 జూలై) జరిగింది. కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే 6ఈ 779 విమానం, బెంగుళూరు నుంచి కొచ్చిన్ వెళ్లే 6ఈ 6505 విమానాలు బెంగుళూరు ఎయిర్‌స్పేస్‌లో ఎదురెదురుగా వచ్చాయి. హైదరాబాద్ వెళ్తున్న విమానంలో 162 మంది, కొచ్చిన్ వెళ్లే విమానంలో 166 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పిన సమయంలో నిలువుగా చూస్తే రెండు విమానాల మధ్య దూరం కేవలం 200 అడుగులు మాత్రమే ఉన్నట్టు అధికారులు తెలిపారు. కొన్ని సెకన్ల తేడాతో విమానాలు పెను ప్రమాదం తప్పించుకున్నట్లు అధికారులు చెప్పారు. టీసీఏఎస్, రిజల్యూషన్ అడ్వైజరీ సిస్టమ్ రెండు విమానాల్లో మోగినట్లు ఇండిగో తెలిపింది. రెండు విమానాలు దగ్గరగా వచ్చినట్టు రెగ్యులేటర్‌లో నమోదైందని ఇండిగో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.