2019లో నేను ఎమ్మెల్యే బరిలో ఉంటా. కందివనం సూర్యప్రకాష్ వ్యాఖ్య

  • షాద్ నగర్ మాజీ జెడ్పిటిసి కందివనం సూర్యప్రకాష్ వ్యాఖ్య

షాద్ నగర్:
నాలుగు సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్ పదవులతో పాటు, వైస్ ఎంపిపిగా, జెడ్పిటిసిగా మా కుటుంబానికి అనుభవం ఉంది. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశా.. ప్రజా జీవితంతో మమేకమై పనులు చేశా. ప్రజల్లో మా కుటుంభం పట్ల అనేక ప్రేమ వాత్సల్యాలు ఉన్నాయి. నేనెందుకు ఎమ్మెల్యే టికెట్ ఆశించ కూడదు అంటూ షాద్ నగర్ మాజీ జెడ్పిటిసి, టిఆర్ ఎస్ సీనియర్ నేత కందివనం సూర్యప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనెవరికీ ఎం తక్కువ కానని తన అభ్యర్ధనను కూడ అధిష్టానం పరిశీలన చేయాలని కోరుతున్నట్టు ఆయన తెలిపారు.