ఎంపీలకు కాళేశ్వరంకు ఆహ్వానం నో!!

Hyderabad:

“రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి బీజేపీ ఎంపీలకు ఆహ్వానం పంపకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులిచ్చింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పరిపాలనలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం.ఈ ప్రాజెక్ట్ వల్ల మునకకు గురైన 27% భూమి మహారాష్ట్ర కు చెందినదే. కేంద్రం వివిధ పథకాల కింద రాష్ట్రానికి పంపించిన నిధులను, ఈ ప్రాజెక్ట్ కు మళ్లించారు. ఈ విధంగా భూమి, నిధులు, క్లియరెన్సులు బిజెపి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం కోసం బహుమతిగా ఇస్తే, ఈ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలను కనీసం ప్రారంభోత్సవానికి పిలవాలన్న కనీస మర్యాదను పాటించక పోవడం శోచనీయం.ఈ ఒంటెద్దు పోకడలను, అహంకారాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.అందుకే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు”అని నిజామాబాద్ ఎంపీ డీ. అరవింద్ ఒక ప్రకటన విడుదల చేశారు.