హైదరాబాద్:
ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడు నగరంలో రెండురోజుల పర్యటన సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసుకమిషనర్ అంజనీకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉపరాష్ట్రపతి ప్రయాణించే దారుల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపడం లేదా మళ్లింపులు ఉంటాయని, ఆయా సమయాల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ నెల 25న మధ్యాహ్నం 12.05 నుంచి 12.55 గంటల వరకు.బేగంపేట ఎయిర్‌పోర్టు, పీఎన్టీ జంక్షన్, శ్యాంలాల్ బిల్డింగ్, హెచ్‌పీఎస్ బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, సీఎం క్యాంపు ఆఫీసు, పంజాగుట్ట ఫ్లైఓవర్, ఎన్ఎఫ్సీఎల్ గ్రేవ్‌యార్డు, టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయం, శ్రీనగర్ టీ జంక్షన్, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్కు చౌరస్తా, కేన్సర్ ఆసుపత్రి, టీఆర్ఎస్ భవన్, ఒరిస్సా ఐల్యాండ్, బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 ఉపరాష్ట్రపతి నివాసం.మధ్యాహ్నం 3.15 నుంచి 4.35, రాత్రి 10.15 నుంచి 11.05 గంటల వరకు.
రోడ్డు నెంబరు 12, మోర్ మెడికల్‌హాల్, ఏసీబీ కార్యాలయం టీ జంక్షన్, సీఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయం, కాజామాన్షన్, మాసబ్‌ట్యాంక్, ఎన్ఎండీసీ, సరోజిని దేవీ కంటిఆసుపత్రి, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, సైబరాబాద్ లిమిట్స్.
26న ఉదయం 9.25 నుంచి 10.05 వరకు:
రోడ్డు నెంబరు 12 ఉపరాష్ట్రపతి నివాసం, ఒరిస్సా ఐల్యాండ్, కేన్సర్ ఆసుపత్రి, సాగర్‌సొసైటీ, నాగార్జునసర్కిల్, జీవీకేఒన్ మాల్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ, తెలుగుతల్లి, అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ క్రాస్ రోడ్స్, తాజ్‌మహల్ హోటల్, బొగ్గులకుంట క్రాస్ రోడ్స్, తెలంగాణ సారస్వత పరిషత్తు.
ఉదయం 10.45 నుంచి 11.30 వరకు
తెలంగాణ సారస్వత పరిషత్తు, ట్రాఫిక్ పీఎస్ ఆబిడ్స్, కలెక్టరేట్, నాంపల్లి టీ జంక్షన్, అసెంబ్లీ, రవీంద్రభారతీ,ఏజీ ఆఫీసు, నక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, యశోధ ఆసుపత్రి, గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లై ఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఎయిర్‌పోర్టు.