ఏడు దశల ఎన్నికలకు ఎంత మంది భద్రతా సిబ్బంది?!

దేశంలో ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల కోసం దాదాపుగా 3 లక్షల పారామిలిటరీ సిబ్బంది, 20 లక్షలకు పైగా రాష్ట్ర పోలీస్ అధికారులు, హోమ్ గార్డులను నియమించినట్టు అధికారులు సోమవారం ప్రకటించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోల్చి చూస్తే ఇంత పెద్ద ఎత్తున 2019 సాధారణ ఎన్నికలకు నియమించిన భద్రతా బలగాల సంఖ్యే అత్యధికమని హోమ్ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుత పార్లమెంటరీ ఎన్నికల కోసం హోమ్ మంత్రిత్వశాఖ 3,00,000కి పైగా సిబ్బంది ఉన్న 3,000 కంపెనీల పారామిలిటరీ దళాలను 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తరలించింది. దాదాపు 20 లక్షల రాష్ట్ర సాయుధ పోలీసులు, భారత రిజర్వ్ (ఐఆర్) బెటాలియన్లు, హోమ్ గార్డులకు ఇది అదనం అని తెలిపారు. భారత రాష్ట్ర పోలీసు బలగాలు సుమారు 21 లక్షలు, పారామిలిటరీ దాదాపు 10 లక్షలు ఎన్నికలకు కేటాయించారు. దశలవారీగా ఎన్నికలు జరగడంతో పారామిలిటరీ దళాలను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించారు.

ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటుహక్కుని స్వేచ్ఛగా వినియోగించుకొనే విధంగా నమ్మకం, భద్రత కల్పించడం ఎన్నికల విధులు నిర్వహించే పారామిలిటరీ సిబ్బంది విధి. అంతే కాకుండా శాంతిభద్రతలు కాపాడటం, ఎన్నికల సందర్భంగా హింసాకాండ చెలరేగకుండా చూడటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) కాపలా వీరి అదనపు విధులు.

3 lakh paramilitary, 20 lakh state police personnel deployed in 7-phase LS polls