బాలల హక్కుల కమిషన్ కు చైర్మన్, సభ్యులను వెంటనే నియమించాలి

బాలల హక్కుల కమిషన్ కు
చైర్మన్, సభ్యులను వెంటనే నియమించాలి.
– మల్లు లక్ష్మి డిమాండ్.

సూర్యాపేట :

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కు చైర్మన్ సభ్యులను వెంటనే నియమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లలపై జరుగుతున్న దారుణాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి పిల్లల మాన, ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పసిపిల్లలు పై జరుగుతున్న దారుణాలు అలాగే మహిళలపై, విద్యార్థులపై జరుగుతున్న అత్యాచారాలపై చర్చించాలన్నారు. 2012లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రేమ్ సెక్సువల్ ఆ ఫెన్స్ చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని కోరారు. మూడు రోజుల్లో రాష్ట్రంలో నలుగురు బాలికల పైన లైంగిక దాడులు జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు . స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆడపిల్లలకు రక్షణ కరువైందన్నారు. రోజురోజుకు ఆడపిల్లలపై మహిళలపై పసి పిల్లలపై జరుగుతున్న దారుణాలను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు . వరంగల్ లో చిన్నారిపై జరిగిన ఘటనపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు . రాష్ట్రంలోని చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష ను వెంటనే అమలు చేయాలని కోరారు .దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను నివారించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని ఆరోపించారు. వరంగల్ లో జరిగిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి భవిష్యత్తులో ఇంకొకరికి ఇలా జరగకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు మేకన బోయిన సైదమ్మ ,జంపాల స్వరాజ్యం పాల్గొన్నారు