ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస క్లీన్‌స్వీప్‌!!

హైదరాబాద్‌:

నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగించింది. వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందగా.. నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మిపై తెరాస అభ్యర్థి చిన్నపరెడ్డి, రంగారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై తెరాస అభ్యర్థి మహేందర్‌రెడ్డి విజయం సాధించారు.