కారును ఆవు పేడతో అలికారు!!

Ahmadabad:

కోటి రూపాయలు పెట్టి ముచ్చటగా కొత్త కారు కొనుక్కున్నాడు. స్టార్ట్ చేసి తొక్కితే సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. అయినా ఏం లాభం.. 45 డిగ్రీల ఎండలో ఏసీ పని చేయటం లేదు. ఫుల్ ఫ్యాన్ స్పీడ్ లో ఏసీ వేసినా ఉక్కబోత తప్పటం లేదంట ఓనర్ కు. అందుకే కొత్త ఐడియా ఆలోచించాడు ఓనర్.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన సెజల్ షా వ్యాపారి. కోటి రూపాయలతో కారు కొనుగోలు చేశారు. ఎండ వేడి నుంచి రక్షణ కోసం, కూల్ కోసం కారు మొత్తాన్ని ఆవు పేడతో అలికేశాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా మందంగా పేడ రాశాడు. ఆ తర్వాత చూడండీ.. కూల్ కూల్ అంట. ఏసీ వేస్తే చలి పుడుతుంది అంట. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందాలి అంటే.. ఇదో చక్కటి ఉపాయం అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఆవు పేడతో కారుకు చల్లదనం వస్తుందో లేదో ఏమోగానీ.. గతంలో ఇంటిని పేడతో అలికేవారు. దీనివల్ల చల్లదనంతోపాటు క్రిమికీటకాలు రాకుండా ఉండేవి. ఎంతలో ఎంత మార్పు.. 50 ఏళ్ల క్రితం ఇంట్లో పేడ అలికేవారు.. ఇప్పుడు కోట్ల రూపాయలు కొనుక్కున్న కారుకు పేడ అలుకుతున్నారు.