విశాఖలో అర్ధరాత్రి దారుణం!

Visakhapatnam:

విశాఖపట్నంలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువతిని సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు.ఆ యువతి తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు.మంటలతో రోడ్డుపై కేకలు వేస్తూ పరిగెత్తింది. ఆమె అరుపులతో ఘటనాస్థలి నుంచి దుండగులు పరారయ్యారు. స్థానికులు గమనించి మంటలు ఆర్పి కేజీహెచ్‌కు తరలించారు.60 శాతం శరీరం కాలినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.