జపాన్ లో సునామీ హెచ్చరిక…

జపాన్ లో సునామీ హెచ్చరిక

మంగళవారం రాత్రి వాయువ్య జపాన్ ను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. దీంతో అధికారులు తీరప్రాంతాలకు ఒక మీటరు ఎత్తున సునామీ రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంపం నమోదైనట్టు జపాన్ వాతావరణ సంస్థ చెప్పింది. యమగాటాకు పశ్చిమ తీరాన సకాటా నగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది.

సముద్ర ఉపరితలానికి దాదాపు 10 కిలోమీటర్ల కింద భూకంపం సంభవించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ భూకంపం చాలా వరకు డొల్లగా ఉంది. డొల్ల భూకంపం భూ ఉపరితలంపై ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. దీంతో వాయువ్య తీరంలోని యమగాటా, నీగాటా, ఇషికావాలలో ఒక మీటరు ఎత్తైన సునామీ రావచ్చిన అంచనా వేసింది. భూకంపం కారణంగా ఏదైనా నష్టం ఏర్పడిందా అనేది పరిశీలించేందుకు రెండు బుల్లెట్ ట్రెయిన్ లైన్లను రద్దు చేసినట్టు క్యోడో వార్తా సంస్థ తెలిపింది. నీగాటాలోని కషివజాకీ-కరివా దగ్గర ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ లోని ఏడు రియాక్టర్లను ఆపేశారు. ఎలాంటి ప్రమాదం జరిగినట్టు వార్తలు రాలేదు.

ప్రపంచంలో అత్యధిక భూకంపాలు, సునామీకి గురయ్యే ప్రాంతాలు ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. మార్చి 11, 2011న 9.0 తీవ్రతతో ఈశాన్య తీరాన్ని భూకంపం తాకింది. దీంతో వచ్చిన సునామీకి 18,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫుకుషిమా పవర్ ప్లాంట్ లో అణు విపత్తు సంభవించింది.