తిరుమలలో కేసీఆర్ కు స్వాగతం.

తిరుమలలో కేసీఆర్ కు స్వాగతం.

Hyderabad:

కేసీఆర్ తిరుమల పర్యటనకు విచ్చేసిన సందర్బంగా రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
సీఎం కేసీఆర్‌కు వైకాపా నేతల ఘనస్వాగతం.
సీఎం కేసీఆర్‌ తిరుమల చేరుకున్నారు. కుటుంబసభ్యులతో సహా శ్రీవారి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు రేణిగుంట విమానాశ్రయం వద్ద వైకాపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద తితిదే ఈవో అనిల్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికారు. ఈ రాత్రి పద్మావతి అతిథి గృహంలో బసచేయనున్న సీఎం‌ కేసీఆర్… కుటుంబసభ్యులతో కలిసి సోమవారం శ్రీవారిని దర్శించుకుంటారు.