92 మందికి ‘క్షమాభిక్ష’! విమాన టికెట్లు ఏర్పాటు చేయాలని గల్ఫ్ సంఘం డిమాండ్!!

Hyderabad:

దుబాయి జైల్లో మగ్గుతున్న 92 మంది భారతీయలకు క్షమాభిక్ష లభించింది.రంజాన్ పండుగ సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉన్నది. జైలు నుండి విడుదలయ్యే ఖైదీలకు భారత రాయబార కార్యాలయం టికెట్లు ఇవ్వాలని గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారు అక్కడే జైల్లో మగ్గే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 92 మంది జాబితాను దుబాయి జైలు అధికారులు ఇండియన్ ఎంబసీకి పంపించారని బసంత్ చెప్పారు.దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి దుబాయిలో ఉన్న దౌత్య కార్యాలయంకి తగిన ఆదేశాలు ఇవ్వాలని బసంత్ రెడ్డి పేర్కొన్నారు.92 మందిలో తెలుగు రాష్టలకు చెందిన వారు కూడా ఉన్నట్టు బసంత్ రెడ్డి తెలిపారు.