ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ లాంచ్

ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ లాంచ్

ఇసుజు తన లైఫ్ స్టైల్ పికప్ డి-మ్యాక్స్ వీ-క్రాస్ ని ఒక సరికొత్త అవతారంలో ప్రవేశపెట్టింది. అద్భుతమైన కొత్త డిజైన్, శ్రేణిలో అత్యుత్తమ ఫీచర్లు దీనిని అన్నిటి కంటే ఆకర్షణీయంగా చేస్తున్నాయి. ఆల్ న్యూ వీ-క్రాస్ తన కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ తో ఒక దూకుడైన, షార్ప్, దమ్మున్న లుక్ లో కనిపిస్తోంది. ఇందులో 20 కొత్త ఫీచర్లు చేర్చారు. వీటితో ఇది రోడ్డుపైన, పక్కన కూడా ఒక అత్యుత్తమ పెర్ఫార్మర్ గా కనిపిస్తోంది.

ఆల్-న్యూ వీ-క్రాస్ ధర గత మోడల్ తో సమానంగా ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.15.51 లక్షలు, జెడ్ వేరియంట్ వెల రూ.17.03 లక్షలుగా ఉండనుంది. కొత్త ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ తన డీఎన్ఏని పూర్తిగా ఫాలో అయింది. ఇది ఒక గేమ్ ఛేంజర్ కానుంది. భారత జీవనశైలి పికప్ సెగ్మెంట్ లో మరోసారి తన కొత్త అవతారంతో మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

కొత్త వీ-క్రాస్ రెండు ట్రిమ్ లెవెల్స్-స్టాండర్డ్ గ్రేడ్, హై గ్రేడ్ లలో లభించనుంది. ఇది రూబీ రెడ్ తో పాటు రెండు కొత్త మెరుగైన కలర్ ప్రత్యామ్నాయాలు-సఫైర్ బ్లూ, సిల్కీ పర్ల్ వైట్ లో వస్తుంది. మార్పుల విషయానికొస్తే కొత్త ఫేస్ లిఫ్ట్ వర్షన్ గత ఏడాది లాంచైన కొత్త ఇసుజు ఎంయు-ఎక్స్ ఎస్ యువి మాదిరిగానే ఉంది. ఫ్రంట్ ఎండ్ లో ఇది మొదటి కంటే ఎక్కువ స్టైలిష్, ఆకర్షణీయంగా ఉంది. ఇందులో కొత్త బంపర్, బై-ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఒక పెద్ద క్రోమ్ గ్రిల్ ఇచ్చారు.

పవర్ స్పెసిఫికేషన్ల గురించి చెప్పుకొంటే ఇందులో 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఇచ్చారు. ఈ ఇంజన్ 134పీఎస్ పవర్, 320ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్ అమర్చి ఉంటుంది. కొత్త 1.9 లీటర్ డీజిల్ ఇంజన్ బీఎస్VI ఉద్గార నిబంధనలతో వచ్చే ఏడాది ప్రవేశపెట్టవచ్చు. ఈ ఇంజన్ 164పీఎస్ పవర్, 360ఎన్ఎం టార్క్ జెనరేట్ చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఒక 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ ఇవ్వవచ్చు.