రేవంత్ రెడ్డి ఇంటిపై ‘ఈడీ’ దాడులు.

హైదరాబాద్:
కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు రెవంత్ రెడ్డి ఇంటితో పాటు వారి మరో ముగ్గురు బంధువుల ఇల్లలో దాడులు జరుగుతున్నవి. 15 చోట్ల దాడులు చేస్తున్న అధికారులు. రెవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించారు. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్, కొడంగల్ తో సహా 15 చోట్ల ఐటి సోదాలు నిర్వహిస్తోంది. పదవి రాగానే ఈడి,ఐటి దాడులు జరుగుతాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టుగానే రేవంత్ రెడ్డి ఆస్తులు, ఇంటి పై ఐటి దాడులు ప్రారంభించింది. గతంలో ఓటుకు నోటు కేసు, జూబ్లీహిల్స్ లో అక్రమ ఫ్లాట్ల విక్రయం చేశారని ఇటీవల పోలీసులు రేవంత్ కు నోటిసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన కొడంగల్, హైదరాబాద్ ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆస్తుల పత్రాలు, వ్యాపార లావాదేవిలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లను స్విచ్చాఫ్ చేయించి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన రెండు ఐటి బృందాలు సోదాలు చేస్తుంది. రేవంత్, అతని సోదరుని కంపెనీల పై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం ఎన్నికల ప్రచారం కోసం 3 కోట్ల రూపాయలు ఎన్నికల ప్రచారం కోసం కొడంగల్ తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నోరు విప్పలేదు. ఇటీవల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసి 14 రోజుల పాటు జైలులో ఉంచారు. ఈ నేపథ్యంలో తన పై కూడా దాడులు జరుగుతాయని రేవంత్ రెడ్డి ఆందోళన చేసినట్టుగా దాడులు జరుగుతున్నాయి. రేవంత్ ఆందోళన వ్యక్తం చేసినట్టుగానే దాడులు జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వరుసగా కాంగ్రెస్ నేతల మీద దాడులు జరుగుతుండటంతో ప్రభుత్వం కావాలనే దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని గురువారం నుంచి షురూ చేద్దామనే ఉద్దేశ్యంతో ఆయను కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకన్నను దర్శించుకొని బుధవారం రాత్రి కొడంగల్ చేరుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభిద్దామనుకునే లోపే ఐటి దాడులు మొదలయ్యాయి.