గురు పూర్ణిమ రోజున గురువు ఇంటికి వెళ్లి ఆశీస్సులు పొందిన విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి

తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును గుర్తుంచుకొని… గురు పూర్ణిమ రోజున గురువు ఇంటికి వెళ్లి ఆశీస్సులు పొందడం ఈరోజుల్లో అరుదైన విషయం.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు తనకు విద్యనందించిన గురువు పోటు సుబ్బయ్య సార్ ను ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొందారు. గురువు ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పది వేల రూపాయలను గురు దక్షిణంగా సమర్పించారు.
తన దగ్గర విద్య నేర్చిన కుర్రవాడు, నేడు రాష్ట్రానికి విద్యా మంత్రి కావటం…. గురువును మరవకుండా వచ్చి కలవటంతో సుబ్బయ్య సారు నేత్రాలు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. గురుపూజోత్సవం రోజు జరిగిన ఈ ఘటన సూర్యాపేట యువతకు చక్కటి సందేశాన్ని… స్పూర్తిని అందించింది.