జగన్ ఔదార్యం!! 10 టివి జర్నలిస్ట్ కు 10 లక్షలు సిఎం సాయం

అమరావతి :

గుంటూరు జిల్లా 10 టివి సీనియర్ రిపోర్టర్ గా పనిచేసే గుంటుపల్లి రామకృష్ణకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. గత కొంతకాలంగా లివర్ వ్యాధితో బాదపడుతున్న రామకృష‌్ణ వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందారు. సాధారణ చికిత్సకు వ్యాధి తగ్గకపోవడంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తప్పని సరని వైద్యులు నిర్దారించారు. హైదరాబాద్ లోని గ్లోబల్ హాస్పెటల్ లో రామకృష్ణకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చు కావడంతో 10 టివి యాజమాన్యం 3 లక్షలరూపాయలు తక్షణ వైధ్య ఖర్చులకు అందజేసింది. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధికి రామకృష‌్ణ తరుపున దరఖాస్తు చేసింది.

సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు రామకృష్ణ వైధ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి విడుదల చేశారు. 10 లక్షల రూపాయల చెక్కును సోమవారం హైదరాబాద్ లో ఉన్న రామకృష‌్ణకు 10 టివి ఇన్ పుట్ ఎడిటర్ చుక్కా రవి అందజేశారు. తన ఆరోగ్యం పట్ల నిత్యం ఆరా తీస్తు స్పందించి తక్షణ ఆర్థిక సహాయం అందించిన 10 టివి యాజమాన్యానికి, సిఇవో గొట్టిపాటి సింగారావు గారికి, పెద్ద మనసుతో సహాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.