కేసీఆర్ పట్టుదలకు ప్రతిరూపం కాళేశ్వరం.

కేసీఆర్ పట్టుదలకు ప్రతిరూపం కాళేశ్వరం.
– చీఫ్ సెక్రటరీ జోషి:

పెద్దపల్లి:

రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదల నిరంతర శ్రమ ఫలితంగా మహద్బుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేసి ప్రజల స్వప్నం సాకారమవుతుందని రాష్ట్ర సీ.ఎస్. జోషి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని ప్యాకేజి 6 కింద నిర్మిస్తున్న పంప్ హౌజ్ , అండర్ టన్నేల్ పనులను సీఎస్ 12 బ్యాంకర్ల ప్రతినిధులతో కలిసి గురువారం పరిశీలించారు. జిల్లాకు చేరిన బ్యాంకర్ల బృందాల ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులకు కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం ప్యాకేజి 6 లో నిర్మించిన అండర్ టన్నెల్ పనులను, సర్జపూల్, పంప్ హౌజ్ పనులను బ్యాంకర్ల ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం అక్కడ నిర్వహించిన పత్రికా సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ సీఎం ఉక్కు సంకల్పం వల్లే కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణం పూర్తయి, ప్రజలకు ఆ ఫలితాలను రికార్డు సమయంలో అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టులో 5 పాత రిజర్వాయర్లు, 19 నూతన రిజర్వాయర్లు, బ్యారేజిలు, పంప్ హౌజ్ లు, సుమారు 203 కిలో మీటర్ల సొరంగ మార్గాలు, విద్యుత్ సరఫరా చేయడానికి 17 సబ్ స్టేషన్ల నిర్మాణం అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని , వీటిని ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన అనుమతులు కోసం సైతం సీఎం ప్రత్యేక ప్రణాళికరుపోందించి అమలు చేసారని, మహరాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వారి సహాకారం తీసుకొని, ఎటువంటి అంతరాష్ట్ర వివాధాలు రాకుండా అతి తక్కువ ముంపుతో కూడిన ప్రాజేక్టుగా కాళేశ్వరంని సీఎం రూపొందించారని సీఎస్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టు ద్వారా ఈ సంవత్సరం ప్రజలకు తొలి ఫలితం అందించడం జరుగుతుందని సీఎస్ అన్నారు. నీటిపారుదల రంగం పై రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ది, పరిజ్ఞానం కారణంగానే భారీ ప్రాజేక్టు త్వరగా పూర్తయిందని సీఎస్ తెలిపారు. అనంతరం పవర్ కార్పోరేషన్ సీఎండి రాజీవ్ శర్మ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజేక్టు రుపొందించడానికి సీఎం కేసీఆర్ చాలా కృషి చేసారని, 1600 గంటలకు పైగా నిపుణులతో చర్చించి , అత్యాధునిక సాంకేతికను ఉపయోగించుకుంటూ లేడార్ సర్వే నిర్వహించి ఈ ప్రాజేక్టు నిర్మాణం చేపట్టారని, రైతులకు సాగు నీరు తప్పకుండా అందించాలనే దృడ సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగారని, ముఖ్యమంత్రి ఆలోచనలకనుగుణంగా రాష్ట్ర యంత్రాంగం, గుత్తేదార్లు పనిచేసి నాణ్యతతో కలిగిన ప్రాజేక్టును రికార్డు సమయంలో నిర్మించారని, దీని వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందని, రైతులకు కరువు భాధలు తీరుతాయని, ప్రతి సంవత్సరం రెండు పంటలకు సాగు నీరందుతుందని, దేశానికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వేగం పాఠం అవుతుందని ఆయన తెలిపారు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని, దీనికి రూపకర్త అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురొగతి పట్ల బ్యాంకర్లు సంతోషం వ్యక్తం చేసారు, ఇంత వేగంగా దేశంలో ఇప్పటి వరకు సాగునీటి ప్రాజేక్టు నిర్మాణం పూర్తి కాలేదని, ఈ ప్రాజేక్టు ద్వారా నీటి విడుదల చేసిన అనంతరం మంచి పంటలు పండడంతో పాటు ప్రజలకు తాగునీరు, రాష్ట్రంలో పరిశ్రమలకు సైతం నీటిని సరఫరా చేసి బృహత్తర ప్రాజేక్టు కాళేశ్వరమని, ఇటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం అయినందుకు బ్యాంకర్లుగా తమకు పూర్తి స్థాయిలో సంతృప్తి ఉందని, ప్రభుత్వానికి తదుపరి సైతం సహాయ సహాకారాలను తామ అందిస్తామని బ్యాంకర్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణం దేశానికి ఆదర్శమని బ్యాంకర్లు అందరు అభిప్రాయపడ్డారు.నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ , పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, ఆంధ్రాబ్యాంక్ ప్రతినిధి పాక్రిసామి, ఇండియన్ బ్యాంక్ ఎంకె.భట్టాచార్య, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ పికే సింగ్, ఆరఈసిఎల్ కె గుప్త, అలహబాద్ బ్యాంక్ రామచంద్ర, ఒరియెంటల్ బ్యాంక్ ప్రతినిధి బాలద్రిష్ణ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హెమంత్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రతినిధి వినోద్ కుమార్, నాబార్డ్ ప్రతినిధి విజయ్ కుమార్, కార్పోరేషన్ బ్యాంక్ అశోక్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి రామకృష్ణ, నవయుగ, మేగా కంపెనీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.