రేపే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం శరవేగంగా ఏర్పాట్లు పూర్తి.

http://www.telanganacommand.com/wp-content/uploads/2019/06/police-security.jpg
karimnagar:

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం జరగనున్నది. ఇందుకు గాను
శరవేగంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెడిగడ్డ వద్ద ఏడు, కన్నెపల్లి వద్ద ఆరు హెలిప్యాడ్ లను సిద్ధం చేశారు. మెడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద హోమాలకు ఏర్పాట్లు పూర్తయినవి. నీటి నిల్వ కోసం అధికారులు గేట్లు మూసివేశారు. వెట్ రన్ కు కన్నెపల్లి పంపు హౌజ్ సిద్ధమైంది. రెండు చోట్ల శిలాఫలకాల ఏర్పాట్లు పూర్తయినవి. మంత్రి ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.గడచిన రెండు రోజులుగా ఆయన అక్కడే మకాం వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తెలంగాణ,మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లను ఆనుకొని ఉన్నందున రాష్ట్ర సరిహద్దులో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. భద్రత ఏర్పాట్లను డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సుమారు 2000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు జరిగాయి. మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ సమీప అడవుల్లో సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. అనుమానిత వ్యక్తులను సాయుధ బలగాలు విచారించి విడిచి పెడుతున్నారు.