కర్నాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

కర్నాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

అసెంబ్లి స్పీకర్‌వ్యూహాత్మక నిర్ణయం సంకీర్ణ ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనంకలిగించింది. రాజీనామాచేసిన ఎమ్మెల్యేల్లో 8 మంది
లేఖలు సరైనఫార్మాట్‌లో లేవని స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.
మిగిలిన 5గురి లేఖలు సరైన ఫార్మాట్‌లో ఉన్నప్పటికీ తనను కలిసిరాజీనామాలకు

గల కారణాలను తెలియజేయాలని మెలికపెట్టారు.ఈనెల 12 నుంచి కర్నాటక అసెంబ్లి

ప్రారంభం కానున్న నేపథ్యంలో అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తనను కలవాలని పేర్కొన్నారు.
కర్ణాటక ప్రభుత్వ సంక్షోభం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది.కర్ణాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌
సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభానికిబీజేపీయే కారణమని కాంగ్రెస్‌ పార్టీ ఉభయ సభల్లోఆందోళనకు దిగింది.
కర్ణాటక లో సంకీర్ణ సర్కారును కాపాడే బాధ్యతను గులాం నబీ ఆజాద్ కు అప్పగించారు.
మరోవైపు ముంబై లో క్యాంప్ లో ఉన్న రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసేందుకు బుధవారం
కర్ణాటక మంత్రి డి. కె.శివకుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన ఎమ్మెల్యేల హోటల్ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది డీకే ను
అడ్డుకున్నారు. పైగా ముఖ్యమంత్రి కుమారస్వామి, డీకే ల నుంచి తమకు ప్రాణ హాని ఉందంటూ
ముంబయి పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.