కవిత..ఓడగొట్టబడింది.

కవిత..ఓడగొట్టబడింది.

– షేక్ చాంద్:

తెలంగాణ ఉద్యమం లో ఉధ్యమసారధి KCR కూతురిగా కన్నా తన అద్భుతమైన వాక్పటిమ, పోరాట పటిమతో ఆనాడు యావత్తు తెలంగాణ సమాజాన్ని ఒక తాటి పైకి తేవడంలో కవిత చేసిన కృషి మరచిపోలేనిది, అలాగే తెలంగాణ జాగృతి స్థాపించి మరుగున పడిపోతున్న తెలంగాణ సంస్కృతికి ప్రాణం పోసిన తెలంగాణ బిడ్డ మన కవిత.ఎప్పుడో చిన్నప్పుడు తెలంగాణ పల్లెల్లో ఆడిన బతుకమ్మ పండగ ఆటా, పాటా నేటి తరం ఆడపిల్లలు బతుకమ్మ ఆడడానికి సిగ్గుపడే పరిస్థితుల్లో ఆ పండగ ఆనవాళ్లు ఇక కనుమరుగు అనుకుంటున్న తరుణంలో తెలంగాణ జాగృతి ద్వారా పల్లె పల్లెలో స్వయంగా తాను తెలంగాణ ఊరూరా తిరిగి తెలంగాణ ఆడపడుచులతో బతుకమ్మ ఆడి తెలంగాణా సంస్కృతికే ఒక చిహ్నం లా ఉన్న బతుకమ్మ ను బతికించిన కవిత కృషిని మరువగలమా,..?నిజానికి కేవలం బతుకమ్మ ఆటలే కాదు మరుగున పడిపోయిన తెలంగాణ బతుకమ్మ పాటలూ, జానపదాలూ, ఒగ్గు కథలూ మళ్ళీ పునరుజ్జీవనం పొందాయంటే దానికి ముఖ్య కారణం తెలంగాణ జాగృతి తరపున కవిత చేసిన గొప్ప కృషియే కారణం కాదనగలరా ఎవరైనా…?ఉద్యమం ఉధృతంగా ఉన్నఫ్ఫుడు రోడ్లపై వంటా వార్పు, బతుకమ్మ ఆటలతో ఉధ్యమకారుల్లో ఎంతో గొప్ప స్ఫూర్తి నింపిన కవిత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుండి MP గా గెలిచిన తర్వాత కూడా తను నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో కృషిచేసింది, పార్లమెంటులో కూడా తన అద్భుతమైన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకొంది.అదే పార్లమెంటులో తాను హామీ ఇచ్చిన నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు సాధన కోసం ఆమె ఎంతగానో పోరాడింది ఐనా కేంద్రం జిల్లాకు పసుపు బోర్డు ఇవ్వలేదు, అలాగే ఎర్రజొన్న రైతులకు కనీస మద్దతు ధర విషయమై ఎన్నో సార్లు పార్లమెంటులో గళమెత్తింది ఐనా కేంద్రం పట్టించుకోలేదు కారణం కేంద్రం లోని BJP పార్టీకి దక్షిణాది అంటే చిన్న చూపు.విచిత్రం ఏంటంటే కవిత ఎంత పోరాడినా పసుపు బోర్డు ఇవ్వని కేంద్రంలోని BJP పార్టీ హీరో అయ్యింది, పసుపు బోర్డు కోసం ఎంతగానో పోరాడిన కవిత విలన్ అయింది నిజామాబాద్ ఓటర్ల దృష్టిలో, నిజానికి ఆమెను కొందరు కుట్రతో అలా విలన్ గా చిత్రీకరింపజేసారు అన్నది వాస్తవం.నిజానికి నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు అనే అంశం కేంద్ర పరిదిలోది కాబట్టి ఆ విషయాన్ని పట్టించుకోని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని , ఇంకా చెప్పలంటే ఆ విషయం జాతీయ స్థాయిలో తెలియాలని దాదాపు నాలుగు వందల మంది రైతులు నామినేషన్ వేయడానికి సిద్దార్థ పడ్డారు ఇదే అదనుగా కొందరు తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకులు ఆ రైతులను కలిసి వారి మనసుల్లో విష భీజాలు నాటారు.మొదట్లో నే TRS పెద్దలు స్పందించి ఆ రైతులతో మాట్లాడి ఉంటే ఆ విషయం సమసిపోయేది కానీ ఆ ఏమౌతుందిలే అనే TRS పెద్దల అలసత్వం వల్ల ఆ ఇష్యూ కోతిపుండు బ్రహ్మ రాక్షసిలా మారింది.మోడీ, అమిత్ షాలు నిజామాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అరవింద్ గెలిస్తే ఐదు నెలల్లో పసుపు బోర్డు స్థాపిస్థాము అని హామీ ఇవ్వడం మరీ విడ్డూరం ఈ ఐదేళ్ళ లో కవిత ఎంత పోరాడినా బోర్డు ఇవ్వని కేంద్రం అరవింద్ గెలిస్తే ఇస్తామని చెప్పడం BJP ద్వంద్వ వైఖరికి స్వార్ధపూరిత రాజకీయాలకు అద్దం పడుతోంది.అలాగే గత సమైక్యాంధ్రలో నిజామాబాద్ నుండి కాంగ్రెస్ తరపున MP గా ఉన్న మధుయాష్కీ గౌడ్ 2014 ఎన్నికల్లో కవిత పైన ఓడిపోవడం మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ తరపున పోటి చేయడం జరిగింది,..పేరుకు ముక్కోణపు పోటీ ఐనా మధుయాష్కీ నామినేషన్ వేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయలేదు అలాగే ఎలాగైనా కవితను ఓడించాలన్న పట్టుదలతో BJP కి లోపాయికారీ మద్దతు ఇచ్చాడు అన్న వార్తలు కూడా వచ్చాయి.నిజానికి ఆరునెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో TRS క్లీన్ స్వీప్ చేసింది,.. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో TRS కు చెందిన MLA లు గెలవడంలో కవిత కృషి మరువలేనిది, కాంగ్రెస్ కు కంచుకోట లాంటి జగిత్యాల లో జీవన్ రెడ్డి ఓటమికి కవిత అహర్నిశలు కష్టపడి ఆ జగిత్యాల స్థానాన్ని కూడా TRS ఖాతాలో వేసింది.కానీ ఆరునెలల లోనే పరిస్థితి తలకిందులుగా మారి స్వయంగా తనే నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోవడం నిజంగా బాధాకరం, కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు కవిత ఓటమికి చాలా విషయాలు దోహదం చేసాయి అనేది నిర్వివాదాంశం,..
తెలంగాణ ఆడబిడ్డ ఐన కవిత ఓటమికి కొందరు ఆనందంగా జబ్బలు చరచుకోవచ్చు కానీ ఆమె ఓటమికి ముఖ్య కారణమైన పసుపు బోర్డును ఇప్పుడు గెలిచిన BJP అభ్యర్థి ఎంత కాలంలో ఏర్పాటు చేస్తారు,..?..ఒకవేళ ఏర్పాటు చేసినా అది తూ..తూ…మంత్రం గా ఉండే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారా లేదా రైతులకు ఉపయోగపడే శాశ్వత బోర్డు ఏర్పాటు చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల కొశ్చన్.