సెమీస్ లో ఓటమి పై సంజాయిషీ కోరిన బీసీసీఐ!

kohli review meeting

ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనను సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు ఎదురైన‌ ఘోర ప‌రాజ‌యం ప‌ట్ల భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి సమీక్షించాలని క్రికెట్‌ పరిపాలకుల కమిటీ నిర్ణయించింది.

త్వరలోనే విరాట్‌ కోహ్లి, రవిశాస్త్రిలతో సమావేశమవుతుంది. అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి నిష్క్రమించింది. కోహ్లి, శాస్త్రి సీఓఏ సభ్యులు వినోద్‌ రాయ్, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ డయానా ఎడుల్జీ, రవి తోడ్గే దీనిపై చర్చిస్తారు.

అంబటి రాయుడు విషయంలో సెలక్టర్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవహరించిన తీరును సీఓఏ ప్రశ్నించే అవకాశం ఉంది. రాయుడు మిడిలార్డర్‌లో సరైనవాడని కాదని భావిస్తే ప్రపంచ కప్‌ ముందు జరిగిన ఆఖరి సిరీస్‌ (ఆస్ట్రేలియాతో) వరకు కూడా అతడిని ఎందుకు ఆడించారనే విషయాన్ని కమిటీ ప్రశ్నించవచ్చు. అలాగే దినేశ్‌ కార్తీక్‌ వైఫల్యం, సెమీస్‌లో ధోని ఏడో స్థానంలో ఆడిన విషయాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.