పోలీసులకు లక్ష్మీ పార్వతి ఫిర్యాదు

Hyderabad:

తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన లక్ష్మీ పార్వతి.తెలంగాణ డిజీపీ,హైదరాబాద్ సీపీ ని కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత లక్ష్మీ పార్వతి.డిజీపీ కి ఫిర్యాదు చేసిన అనంతరం సిపి ని కలిసిన లక్ష్మీ పార్వతి.”మాజీ ముఖ్యమంత్రి భార్య గా ఉన్న నన్ను నాప్రతిష్ఠ ను దెబ్బతీయలని కుట్రలు చేస్తున్నారు.కొన్ని మీడియా ఛానెల్స్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.కోటి అనే వ్యక్తి నా కొడుకు లాంటి వాడు. నాకు మందులు తీసుకొచ్చే వాడు.

అలాంటి వాడు నాపై ఫిర్యాదు చేయడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.డిజీపీ ని కలిశాను,డిజీపీ సీపీ కి ఫోన్ చేసి కేసు చూడమన్నాను.సీపీ ని కలిసి వివరాలు అన్ని చెప్పాను.వెంటనే స్పందించిన సీపీ అంజన్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులను పిలిపించి వివరాలు తీసుకున్నారు.నా ఫోన్ ను పోలీసులకు అప్పగించాను.నా పై సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా లో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాను.అన్ని విధాలుగా దర్యాప్తు జరిపించి దోషిలను శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు” అని లక్ష్మీపార్వతి చెప్పారు.