ఈవీఎంలపై ఊర్మిళ అనుమానాలు!

ముంబై నార్త్ లోక్ సభ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటి ఊర్మిళ మాతోండ్కర్ రాజకీయ రంగప్రవేశం చేస్తూనే ఓటమిని ఎదుర్కొనాల్సి వచ్చింది. లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళుల ప్రకారంగానే ఫలితాలు వెలువడ్డాయి. దీనిపై ఊర్మిళా మాతోండ్కర్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఊర్మిళ తన ట్వీట్ లో తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టిని అభినందించింది. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది.