అదృష్ట జాతకుడు మంత్రి మల్లారెడ్డి!!

అదృష్ట జాతకుడు మంత్రి మల్లారెడ్డి!!

Hyderabad:

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాలలో మంత్రి మల్లారెడ్డి కూడా భాగస్వామి కానున్నారు.ఈ ప్రాజెక్టు అంతర్భాగం గా ధర్మారం మండలం నంది మేడారం దగ్గర ప్యాకేజీ -6 పంపు హౌజ్ ను కార్మికమంత్రి మల్లారెడ్డి ప్రారంభించనున్నారు.కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన వివిధ బ్యారేజీలు , పంప్ హౌస్ లను రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మంథని మండలం అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ లను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తారు. అంతర్గాం మండలంలో గోలివాడ వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల పంప్ హౌస్ ను కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో వివిధ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.