టీవీ9 కేసు నిందితుడు శివాజీకి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టిన పోలీసులు

Hyderabad:

అమెరికా పారిపోయే ప్రయత్నంలో హీరో శివాజీని బుధవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ క్రైమ్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు.హీరో శివాజీ కి 41 crpc పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఈ నెల 11వ తేదీన తిరిగి హాజరు కావాలని ఆదేశించారు.హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు crpc 41 కింద నోటీసులు ఇచ్చి పంపినట్టు పోలీసులు చెప్పారు.అలంద మీడియా కేసు లో హీరో శివాజిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు. హీరో శివాజీ పైన గతంలో ‘లుకవుట్’ నోటీసులు జారీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం తో హీరో శివాజి ని పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.