అమ్మను కోల్పోవడమంత బాధ మరొకటి లేదు

అమ్మను కోల్పోవడమంత బాధ మరొకటి లేదు

తన తల్లి మరణం అంత బాధ మరెప్పుడూ అనుభవించలేదని బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ చెప్పారు. తల్లి ప్రిన్సెస్ డయారా మరణం గురించి విపులంగా చెబుతూ ఆమె లేని లోటు అంత బాధ మరేది లేదని అన్నారు. మానసిక ఆరోగ్యంపై బీబీసీ నిర్మిస్తున్న డాక్యుమెంటరీలో మాట్లాడుతూ ఎయిర్ అంబులెన్స్ పైలెట్ గా పని చేసిన సమయంలో మరణం తలుపు దగ్గరే తచ్చాడుతోందనే భావన కలిగేదని వివరించారు. ఈ ఆలోచనలను వేరొకరితో కలిసి మాట్లాడే వరకు పెద్ద సమస్యగా బాధించాయని తెలిపారు.

వ్యక్తిగతంగా ఎదురైన ఇబ్బందులను ఎలా అధిగమించారనే చర్చ సందర్భంగా విలియమ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ చర్చలో సాకర్ స్టార్స్ పీటర్ క్రౌచ్, థియరీ హెన్రీ, డానీ రోజ్, జెర్మయిన్ జెనాస్, ఇంగ్లాండ్ మేనేజర్ గారెత్ సౌత్ గేట్ కూడా పాల్గొన్నారు. ప్రిన్స్ విలియమ్, ఆయన సోదరుడు ప్రిన్స్ హ్యామీ మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నారు. తమకెదురైన కష్టాలు, వాటిని ఎదుర్కొన్న తీరు గురించి నిర్భయంగా వివరించడం వల్ల సహాయం అవసరమైన వారికి ధైర్యాన్ని ఇవ్వగలదని భావిస్తున్నారు.