వయనాడ్ లో 8 లక్షల మెజారిటీతో నెగ్గిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రికార్డు మెజారిటీతో కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి పీపీ సునీల్ పై 8 లక్షలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే రాహుల్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ ఆధిక్యం లక్షలకు పెరిగింది. మొత్తంగా రాహుల్ గాంధీ 12,76,945 ఓట్లు సాధించారు. రెండో స్థానంలో నిలిచిన సీపీఐ అభ్యర్థి సునీర్ కు 4,77,783 ఓట్లు వచ్చాయి.

రాహుల్ గాంధీ విజయాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు సంబరంగా జరుపుకున్నారు. డీసీసీ కార్యాలయం దగ్గర భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడిని అభినందిస్తూ నినాదాలు చేశారు. అయితే రాహుల్ గాంధీ తన సంప్రదాయికంగా కంచుకోట అయిన అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో వెనుకంజలో ఉన్నారు. రాహుల్ రెండో స్థానంగా వయనాడ్ ను ఎంచుకోవడంతో 17వ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కలగనుంది.