టీడీపీకి బెజవాడ తెలుగు తమ్ముళ్లతో చిక్కులు

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పుట్టెడుకష్టాల్లో ఉన్న టీడీపీకి ఇప్పుడు బెజవాడ తెలుగు తమ్ముళ్లు మరింత చిక్కులు తెచ్చిపెడుతున్నారు.. పర్సనల్ ఇగోలతో ఒకరిపై మరొకరు ట్విట్టర్ వేదికగా తిట్ల పురాణాలతో పరువు బజారుకీడుస్తున్నారు .ఎంపీ కేశినేనినాని, ఎమ్మెల్సీ బుద్దావెంకన్న మధ్యలో పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ మాజీఛైర్మన్ నాగుల్ మీరు వీరు ముగ్గురూ ట్విట్టర్లో చేసుకుంటున్న విమర్శలతో టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే టీడీపీ ఇప్పుడు తనపార్టీ నేతలో వ్యక్తిగత విమర్శలతో దుమ్మెత్తిపోసుకుంటుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు. నేతలకు సర్త్దిచెప్పే ప్రయత్నంచేసినప్పటికీ వినకపోవడంతో ఏంచేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. పోనీ ఎవరినైనా సస్పెండ్ చేద్దామంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ పని చేయలేమంటున్నారుపార్టీ పెద్దలు.. ఈ ముగ్గురు నేతల తిట్లు ఇటు మీడియాకు మాత్రం యమా కాలక్షేపంగా మారాయి…గుళ్లో కొబ్బరి చిప్పలు అమ్ముకునేవాడు, సైకిల్ బెల్లులు కొట్టేసేవాడంటూ బుద్దావెంకన్న ను కేశినేనినానితిడితే.. దొంగ బస్సులు నడిపావంటూ ఘాటుగా రిప్లై ఇఛ్చారు బుద్దావెంకన్న. పార్టీలో కొంతమంది గ్రూపులు, గ్యాంగులు ఏర్పాటుచేస్తున్నారని వేరేపార్టీలో చేరడానికి ప్రయత్నిస్తూఅన్నంపెట్టినపార్టీని విమర్శిస్తున్నారంటూ కేశినేనినాని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక్కడే కేశినేని ఇగో హర్ట్ అయింది.. తనవెనకాల తిరిగినోడు ఇప్పుడే తననే అంటాడా అంటూ ఆ వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకున్నారు. అందుకే ట్విట్టర్ వేదికగా తిట్ల వర్షం కురిపిస్తున్నారు..దీనికి తోడు ప్రతిరోజూ ఏదో ఒక ఇష్యూగా టీీవీ హెడ్ లైన్స్ లో బుద్దావెంకన్న కనిపిస్తుండడం, ఆఖరికి అతను ట్విట్టర్లో పోస్టుపెట్టినా కూడాటీవీ ఛానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ గా రావడంకూడా ఆగ్రహానికి కారణమయింది. అసలు ఏమీ చదువు సంధ్యాలేని బుద్దావెంకన్న ఏకంగా ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం ఏంటి అంటూ మండిపడ్డారు. అందుకే నాలుగు ఓట్లుసంపాదించలేని వారు నాలుగు పదవులు సంపాదించారు…నాలుగు ముక్కలు చదవడం రానివారు కూడా ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారంటూమండిపడ్డారు. అంతటి తో ఆగకుండా కొబ్బరిచిప్పలు అమ్ముకునేవాడు, సైకిల్ బెల్లులు కొట్టేసినోడు అంటూ బుద్దావెంకన్నను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో వార్ మరింత ముదిరింది. అందకు ప్రతీకారంగా బుద్దావెంకన్న కూడా ఏమాత్రం తగ్గకుండా కేశినేని దొంగబస్సులు నడిపారని, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చిరంజీవిని ముంచాడంటూ ఘాటుగా పోస్టులు పెట్టారు. వాస్తవానికి కేశినేని నాని ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పటికి బుద్దావెంకన్న ఎవరో కూడా బెజవాడలో చాలామంది నాయకులకు తెలియదు.. కేవలంపార్టీలో ఉన్న వీధి నాయకుడు మాత్రమే..అయితే 2014ఎన్నికల కు ముందు దుర్గగుడి ఫ్లైఓవర్ బుద్దావెంకన్నకు రాజకీయ ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలంటూ ధర్నాలు,ఆందోళనలు చేసారుబుద్దావెంకన్న,,అప్పట్లోఫ్లైఓవర్ కోసం చేసిన ధర్నాకు ఏకంగాప్రతిపక్ష నేత చంద్రబాబునుతెచ్చి దర్నాలో కూర్చోబెట్టి ఆయన దృష్టిలో పడ్డారు. అసలు మాట్లాడడం కూడా రాని బుద్దావెంకన్న ఏకంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని ఆశించారు. అయితే ఆ సీటు దక్కలేదు. కానీ పార్టీ అర్బన్ అధ్యక్షపదవి మాత్రం దక్కింది. తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు.. తర్వాత ప్రభుత్వ విప్ అయ్యారు.. ఆ తర్వాత మీడియాలో ఫోకస్ పుణ్యమా అని పార్టీ అధికార ప్రతినిధి కూడా అయ్యారు.. ఏకంగా నాలుగు పదవులతో రికార్డ్ సృష్టించారు బుద్దావెంకన్న…ఇదంతా కేవలం ప్రతిరోజూ మీడియాలో కనిపించడం, వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ వైసీపీని విమర్శించడం పనిగా పెట్టుకుని పార్టీ అదినేత దగ్గర మార్కులు కొట్టేశారు. ఎలాంటి అపాయిట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా చంద్రబాబు దగ్గరకు వెళ్లే ఏవిషయాన్ని అయినా మాట్లాడేదశకు చేరుకున్నారు. ఎవరికి పోస్టింగ్ కావాలన్నా బుద్దావెంకన్నను ఆశ్రయించేవారు. పార్టీకోసం పని చేస్తున్న ఎంతో మంది నేతలు ఉండగా కేవలం మీడియా ఫోకస్ తో హైలెట్ అయి భజన చేస్తున్న బుద్దావెంకన్న అన్ని పోస్టులు ఇవ్వడం, అతనికి అంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది…అదేక్రమంలో ముక్కుసూటితనంతో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఎప్పుడూవివాదాలతో పార్టీ అధినేతకు కాస్తందూరమయ్యారు కేశినేనినాని.. అందులోనూ తన కేశినేని ట్రావెల్స్ విషయంలో మరింత అబాసుపాలయ్యారు. ముఖ్యంగా ట్రావెల్స్ విషయంలో ట్రాన్స్ పోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యంతో జరిగిన గొడవకారణంగా పార్టీ అదినేత చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. అప్పటి నుంచి చంద్రబాబుతో గ్యాప్ మెయింటైన్ అవుతూ వస్తోంది.అప్పుడే తనట్రావెల్స్ ను మూసేస్తూసంచలన నిర్ణయంతీసుకున్నారు కేశినేనినాని,, అధికార పార్టీలో ఉండి కూడా ఎంపీనయి ఉండి తనకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే ట్రావెల్స్ మూసివేసే పరిస్థితికివచ్చిందని అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు కేశినేని నాని.. కనీసం తాను చెప్పినవారికి నామినేటెడ్ పోస్టులు కూడా దక్కడం లేదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసేవారు. భజనపరులకు ఇచ్చే ప్రాధాన్యత తనలాంటి ముక్కుసూటిగా వ్యవహరించేవారికి ఉండడం లేదని పార్టీపెద్దల దగ్గర పదేపదే వ్యక్తంచేసేవారు. మొన్నటి ఎన్నికల్లో తానుతిరిగి రెండోసారి ఎంపీగాగెలిచినప్పటికీ సరైన ప్రాధాన్యత పార్టీలో దక్కడంలేదని మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాల మీటింగ్ లో బుద్దావ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా చేశాయి..అందుకే బుద్దావెంకన్న టార్గెట్ గా విమర్శల మీద విమర్శలుచేస్తూనే ఉన్నారు. అంతేగాక కాల్ మనీసెక్స్ రాకెట్ నిందితుడు అంటూ బుద్దావెంకన్నను ఉద్దేశించి పెట్టి ట్వీట్ పార్టీలపెద్దల్లో కూడా ఆగ్రహానికి కారణమయింది. అయితే కేశినేనికి చంద్రబాబుతరఫున రంగంలోకి దిగిన పెద్దలు సర్దిచెప్పేప్రయత్నంచేశారు కానీ ఆయన ఎక్కడాతగ్గలేదు..ఇటు
బుద్దావెంకన్నతోూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే తననుఇంతలా బజారుకీడ్చిన ఎంపీ కేశిేనేని ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదిలేదంటున్నారు బుద్దావెంకన్న..మొత్తం మీద ఈ ఇద్దరివ్యవహారం ఇప్పుడు పార్టీకి పెద్దతలనొప్పిగా మారింది. అయితే అధికార వైసీపీకి ఇది కలిసి వచ్చే అంశమే.