Suzuki Gixxer SF 150cc, 250cc లాంచ్, ధరలు ఎంతంటే..

జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ సుజుకీ భారత మార్కెట్లోకి కొత్త జిక్సర్ బైకులు లాంచ్ చేసింది. 2019 సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఏబీఎస్ ఆరంభ ధర రూ.1.70 లక్షలుగా నిర్ణయించారు. భారత్ లో ఈ సెగ్మెంట్ బైకులు పాపులర్ కావడంతో కంపెనీ ఇంతకు ముందు కూడా ఈ సెగ్మెంట్ బైకులు లాంచ్ చేసింది. దీంతో పాటే కంపెనీ జిక్సర్ 150 ఎస్ఎఫ్ ని కూడా లాంచ్ చేసింది. దీని ధరను రూ.1,09,800 గా నిర్ణయించింది.

జిక్సర్ ఎస్ఎఫ్ 250లో 249సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇచ్చారు. ఇది ఆయిల్ కూల్డ్. ఈ ఇంజన్ 26 బీహెచ్ పి పవర్ ఇస్తుంది. ఇందులో ఆరు గేర్ బాక్స్ ఉంది. ఎల్ఈడీ హెడ్ లైట్స్, స్ప్లిట్ సీట్స్, 17 అంగుళాల మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ అమర్చారు. ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్ విషయానికొస్తే ఎల్సీడీ అమర్చారు. ఈ బైకులో డ్యుయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇచ్చారు. జిక్సర్ ఎస్ఎఫ్ 250లో టెలీస్కోపిక్ ఫోర్క్స్ ఇచ్చారు. ఇవి ముందువైపు ఉంటాయి. వెనక మోనోషాక్ ఇచ్చారు. ఈ బైకులో డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్ ఇచ్చారు. కొత్త సుజుకి జిక్సర్ లో కాస్మెటిక్ ఛేంజ్ కూడా ఉంది. ఇందులో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. స్పోర్టీ స్ప్లిట్ సీట్ అమర్చారు.

2019 సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 రియర్, ఫ్రంట్ లో డిస్క్ బ్రేకులు ఇచ్చారు. 250సీసీకి చెంది ఈ బైకు ఫుల్ ఫెయిర్డ్. చూడటానికి స్పోర్టీగా కనిపిస్తుంది. భారత్ లో ఈ బైక్ యమహా ఫేజర్ 25, హోండా సీబీఆర్, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, కెటిఎం ఆర్సీ200 వంటి బైకులతో పోటీ పడనుంది.

జిక్సర్ ఎస్ఎఫ్ 150-ఫేస్ లిఫ్ట్ వర్షన్ 2019 సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 150 గురించి చెప్పాంటే ఇందులో 155సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. ఇది 14.5 బీహెచ్ పి పవర్ ఇస్తుంది. ఇందులో సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ఇచ్చారు. ఈ 150సీసీ బైక్ కి ముందు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ మోనోషాక్ అమర్చారు. టైర్లు మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఈ బైక్ హెడ్ ల్యాంప్ ని అప్పీలింగ్ గా చేసేందుకు యాంగులర్ గా మార్చారు. ఇది చూసేందుకు స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ బైకులో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ఇచ్చారు. ఇందులో కొన్ని కొత్త ఫీచర్లు జోడించారు.