గడీల నిర్మాణం వద్దు!! – టి.కాంగ్రెస్

Hyderabad:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రెటేరియేట్,అసెంబ్లీ భవనాల పేరుతో తలపెట్టిన ‘గడీల నిర్మాణం’ పట్ల తెలంగాణకాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీఎల్పీనేత భట్టివిక్రమార్క,ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి,శ్రీధర్ బాబు తదితర నాయకుల బృందం సొమవారం అసెంబ్లీ,సెక్రెటేరియేట్ లను సందర్శించింది. రాష్ట్రం తెచ్చుకున్నది ఉన్నవి కూల్చి ..కొత్తవి కట్టుకోవడం కోసం కాదని, అసెంబ్లీ , సచివాలయం కొత్త నిర్మాణాలు అవసరంలేదని వారన్నారు. ఏపీ భవనాలుకూడా ఇచ్చాక కొత్తవి ఎందుకు ..?అని ప్రశ్నించారు. డి , సి , ఎల్ బ్లాక్ లు అన్ని ముప్పై సంత్సరాలు కింద కట్టినవేనని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంపై సరిపడ వసతులతో ఉన్న సచివాలయం తెలంగాణకు సరిపోదా .?అని ప్రశ్నించారు. కేసీఆర్ చక్రవర్తిలా ప్యాలస్ లు కట్టుకోవాలని అనుకుంటున్నారనికాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పారు,. కేసీఆర్ చేస్తున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చెప్పేందుకే ..సచివాలయ పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు. కేసీఆర్ మూఢనమ్మకాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వందేళ్ల వరకు ఉండేలా నిర్మాణాలు సచివాలయంలో ఉన్నాయని చెప్పారు. ముప్పై ఏళ్ళు నిండిన భవనాలను ఎందుకు కూల్చుతారు .?అని ప్రశ్నించారు. వెయ్యి కోట్ల విలువైన సచివాలయ భవనాలను మూఢ నమ్మకాల కోసం కూల్చివేతను కాంగ్రెస్ అంగీకరించదన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు పాడుపడిపోయినవని తెలిపారు.రెండు వేలకోట్లు పెడితే బడుగు విద్యార్థులకు పాఠశాల భవనాలను నిర్మించవచ్చునని చెప్పారు. అమరవీరుల స్థూపంకు నాలుగేళ్లయినా దిక్కులేదని, కోట్లతో ప్రగతిభవన్ మాత్రం కట్టుకున్నారని తెలిపారు. తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అర్థంలేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ప్రతిపక్షంగా మేము అడుగుతాం ..ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు , గురుకుల పాఠశాలల నిర్మాణం తక్షణమే నిర్మించాలని డిమాండు చేశారు. కూల్చితే ..అడ్డం పడుకుంటాం. కాంగ్రెస్ ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రజాసంఘాలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తన ట్రేడ్ మార్క్ కోసమే కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారని విమర్శించారు. కేసీఆర్ ముందు ఉద్యోగుల సమస్యల వేతనాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొడుకు కోసమే కేసీఆర్ కొత్త సచివాలయం అంటున్నారని ఆరోపించారు. ”ప్రజాస్వామ్యంలో రాచరిక పాలన చేస్తామంటే ఉర్కొం. ఖరీఫ్ ప్రారంభమైన బ్యాంకర్స్ సమావేశం పెట్టలేదు. ఇంకా రుణమాఫీపై క్లారిటీ లేదు. సిర్పూర్ ఘటన పై ప్రభుత్వ వ్యవహారం బాగాలేదు. పోడుభూముల సమస్య పరిష్కరిస్తామన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడరు .?సీఎం వద్దంటారు ..అధికారులను పోడుభూములను లాక్కోమంటారు .. ఇదెక్కడి న్యాయం?పోడు భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పోరాడుతాం. అధికారులపై టీఆరెస్ నేతల దాడిని ఖండిస్తున్నాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి”అని కాంగ్రేస్ నాయకులు అన్నారు.