కన్నీళ్ళతోనే కడుపు నింపుకుంటున్న ఓ గల్ఫ్ కార్మికుడు

కన్నీళ్ళతోనే కడుపు నింపుకుంటున్న ఓ గల్ఫ్ కార్మికుడి విషాద గాథ..నిర్మల్ జిల్లా కడెం మండలం పేద తడుపు గ్రామానికి చెందిన తాళ్ళపెళ్లి నారాయణ (40)అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం ఇరాక్ వలసవెళ్లాడు. అక్కడ తీవ్రవాదులకు సహకరిస్తున్నాడు అనే అనుమానంతో ఇరాక్ పోలీస్ లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు..జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారు..బాధితునికి భార్య విజయ(35)కూతురు పూజిత(16)కొడుకు వంశీ(6) వున్నారు..ఈ నిరుపేద గల్ఫ్ కార్మికుడి కుటుంబాని ఆదుకునేది ఎవరు..? వీళ్ళ చీకటి బతుకుల్లో వెలుగులు నింపేది ఎవరు..?