‘టిక్ టాక్’ చేసిన హత్య!!

‘టిక్ టాక్’ చేసిన హత్య!!

http://www.telanganacommand.com/wp-content/uploads/2019/04/tiktok.jpg

chennai:

టిక్ టాక్ యాప్ కారణంగా భార్యను భర్త హతమార్చిన ఘటన తమిళనాడులోని కోవై సమీపంలో చోటుచేసుకుంది.అరివొలినగర్‌కు చెందిన కనకరాజ్‌ (35) బిల్డింగ్‌లు కట్టే కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు.అతని భార్య నందిని(28) స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తుంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.అయితే కుటుంబ తగాదాల కారణంగా కనకరాజు, నందిని రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నందిని కొన్ని నెలలుగా టిక్‌టాక్‌కు బానిసగా మారి రోజూ ఎక్కువగా వీడియోలు పెడుతుంది. ఆమెకు ఫాలోవర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో.. భర్త కనకరాజు ఆమెకు ఫోన్ చేసి టిక్ టాక్ వీడియోలు చేయొద్దంటూ హెచ్చరించాడు.తనతో వచ్చి కాపురం చేయాలని కోరాడు. అయితే భర్త మాటలను పట్టించుకోకుండా ఆమె ‘టిక్ టాక్’ వీడియోలను తీస్తూనే ఉంది.దీంతో ఆగ్రహించిన భర్త కనకరాజ్‌ మద్యం సేవించి నందినికి ఫోన్ చేశాడు. ఆ సమయంలో నందిని ఫోన్ బిజీ అని వస్తుండడంతో.. భార్య పని చేస్తున్న కళాశాలకి వచ్చి గొడవపడ్డాడు. కోపంలో తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి నందినిని పొడిచాడు.
దీంతో అక్కడికక్కడే ఆమె చనిపోయింది.
నందిని మృతదేహాన్ని కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కనకరాజ్‌ని అరెస్టు చేశారు పోలీసులు.