ఉద్యమాల్లో గింత చేసినం సర్.. కానీ… ఒక జర్నలిస్ట్ ఆవేదన.

ఇప్పుడు అన్ని ఎన్నికలను 6 నెలల్లో పూర్తి చేసి ప్రజాస్వామ్య రాష్ట్రం లో మరో 5 ఏండ్లు పగ్గాలు పట్టుకొని ఉన్నారు. మీరు ఆశ పెట్టి ఓట్లు అడుకున్నారు. ఉద్యమ జర్నలిస్టులు గా మేము ఓట్ వేశాం. కానీ అన్ని హామీలను మరిచిపోయి , ఏదో వంకలు పెట్టి, కాలయాపన చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు, అవసరానికి ఉపయోగపడే ఆరోగ్య భీమా.. ని ఎన్నో సార్లు హామీలు ఇచ్చారు. వచ్చే ఏడాది యటాను కోసి ఇండ్లలోకి వచ్చి నాకుపెట్టలే అని చెప్పారు.. కానీ మీ హామీలు ఇంకా నెరవేరలేదు సీ.ఎం.సర్.. అవసరానికి అదుకొవడం లేదు .. లీడర్ల కాళ్ళు పట్టుకుంటే యశోదా లో పనిచేస్తుంది తప్పా.. ఎక్కడ ప్రైవేటు లో పని చేస్తా లేదు. ఇంకా..సమాజం కోసం పాటుపడుతారు.. ఇల్లు జగాన , ఇల్లో ఇస్తనని మొదటి నుంచి చెప్పారు..అధికారం వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆశ చూపించారు. 5 ఏండ్లుగా ఆ హామీ ఎప్పుడు ఒక్క అడుగు ముందు పడలేదు.. మీరు అదిగో తోక అంటే.. ఇదిగో పులి అని యూనియన్స్ అనుకున్నాయ్..మాలో మాకే లొల్లులు పుట్టించి.. సంబరపడ్డారు కొందరు మీ పార్టీ నాయకులు.. జర్నలిస్ట్ లు..ఐనా.. జర్నలిస్టులు ఓపికగా మీ మాటలను పాటించాం. ఎప్పటికైనా కేసీఆర్ సర్ చేస్తారని తెలంగాణ జర్నలిస్టులు నమ్మారు.. నమ్ముతున్నాం.. ఆంధ్ర హౌసింగ్ సొసైటీ అయిన ఓ పురాతన సొసైటీ తో సంబంధం లేకుండా న్యాయం చేస్తారని.. ఇప్పుడైనా ఎం.పీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇంకా ఏమి ఎన్నికలు దరిదాపుల్లో లెవ్వని KTR గారు చెప్పారు.. అందుకే ఇప్పుడు మా హామీలను గుర్తుచేస్తున్నాం. మీరూ మాట నిలపెట్టుకునే , విశ్వసనీయత నేతగా అడుగుతున్నాం.ప్రజలకు కనిసం గూడు, ఆరోగ్యం భీమా కలిపించే నిబద్ధత.. మీకు ఉందని, చేస్తారని నమ్మకంతో.. చిన్న ఆశతో మీ తెలంగాణ జర్నలిస్టులు..

ఇట్లు..
జర్నలిస్టుల ఇంటి కోసం ఫోరమ్.
9848070809.
TSWJHS@GMAIL.COM