కేబినెట్ విస్తరణపై కసరత్తు! హరీశ్ రావుకు బెర్తు ఖరారు!

కేబినెట్ విస్తరణపై కసరత్తు!
హరీశ్ రావుకు బెర్తు ఖరారు!

Hyderabad:

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 15 లోపే కేబినెట్ విస్తరణ ఉండవచ్చు.హరీశ్ రావు,కేటీఆర్ లకు ఈ దఫా అవకాశం ఉంటుందని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ నరసింహన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఈ మేరకు సంకేతం ఇచ్చారని తెలుస్తోంది. హరీశ్ రావుకు కేబినెట్ లో చోటు లభిస్తుందా, లేదా అన్న మీమాంసకు తెరపడినట్టు కొన్ని వర్గాలు చెబుతుండగా, కేసీఆర్ వైపు నుంచి ఇంకా స్పష్టత రావలసి ఉందని మరికొన్ని వర్గాలు అంటున్నాయి.ఇటీవల లోక్ సభ ఎన్నికల ఫలితాలు,ఇతర రాజకీయ కారణాలతో హరీశ్ కు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు ఒక ప్రచారం ఉంది.అయితే కేసీఆర్, హరీశ్ మధ్య ఏర్పడిన ‘గ్యాప్’తొలగిపోలేదని, ఆ ‘గ్యాప్’ ను పెంచేందుకు కేసీఆర్ ‘పరివారం’లోని కొందరు ‘వ్యక్తులు’ కృషి చేస్తున్నారని టీఆరెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.