ఏపీలో ‘ట్విట్టర్ వార్’!

amaravathi:

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య యుద్ధానికి ‘ట్విట్టర్’ వేదికయ్యింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో విమర్శలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.లోకేష్,విజయసాయి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ పాలనలో బీమా అందడం లేదని, విత్తనాలు ఇవ్వడం లేదని, పింఛన్లు అందడం లేదని లోకేష్ ఆరోపణ. ‘నేను విన్నాను, నేను ఉన్నాను అన్నారు.. ఏం విన్నారు? ఎక్కడున్నారు’? అని లోకేష్ ట్విట్టరులో ప్రశ్నించారు. పాలన చేతకాక, ఇప్పుడు చంద్రబాబే వింటాడు, చంద్రబాబే ఉంటాడు’ అని అంటున్నారని లోకేష్ ట్వీట్ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో జగన్ కు పరిపాలన చేతకావడంలేదు’ అని లోకేష్ అన్నారు. .వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి కూడా వరుస ట్వీట్స్‌తో ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు. ‘నిరుద్యోగ యువతను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తుంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా చంద్రబాబు గారూ’ అని విజయసాయి హేళన చేశారు. ‘నిజాయితీగా పనిచేశామని చెప్పుకుంటూ ఉన్నారు.ఇంకోవైపు మాపై విచారణకు ఆదేశించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు ”అని విమర్శించారు. ‘రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా?’ అనికూడా విజయసాయిరెడ్డి తన ట్వీట్స్‌తో విరుచుకుపడ్డారు.