V6 రిపోర్టర్ ప్రసన్న కుటుంబానికి 5 లక్షలు. -మంత్రి హరీశ్ రావుకు జర్నలిస్ట్ ల కృతజ్ఞతలు.

హైదరాబాద్:
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మెదక్ జిల్లా వీ6 స్టాఫ్ రిపోర్టర్ ప్రసన్నకుమార్ కుటుంబానికి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 న రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ప్రసన్న దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన రోజు మంత్రి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు . గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో ప్రసన్న డెడ్ బాడీకి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రసన్న తల్లి, భార్యను సోమవారం హైదరాబాద్ పిలిపించి ఆర్థిక సాయాన్ని అందించారు. భవిష్యత్ లోనూ ఆ కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రసన్న కుటుంబానికి అండగా నిలిచినందుకు మంత్రి హరీష్‌రావు కు జర్నలిస్ట్ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.